తెలంగాణ వీణ, సినిమా : మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్రిపుల్ ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ అవ్వడంతో పాటు ఆస్కార్ ను కూడా అందుకున్న విషయం తెలిసిందే.. ఆ సినిమాతో వరల్డ్ ఫెమస్ స్టార్ అయ్యాడు.. ఈసినిమాలో చరణ్ నటనకు అవతార్ డైరెక్టర్ జేమ్స్ కామరూన్ లాంటి దర్శకులు కూడా ఫిదా అయ్యారంటే.. చరణ్ ఇమేజ్ ఏ రేంజ్ కు వెళ్ళిందో తెలుస్తోంది. ఇక ఇండియన్ సినిమాలకు ఎక్కువగా అభిమానులు ఉండే జపాన్ లో అయితే రామ్ చరణ్ ఎంతటి స్టార్‌డమ్ ని అందుకున్నాడో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు..అక్కడ చెర్రి కోసం గ్రాండ్ గా వెల్కమ్ కూడా చెప్పారు.. ఒక తెలుగు నటుడికి ఈరేంజ్ లో స్వాగతం దక్కడం అంటే.. అది మామూలు విషయం కాదు. జపాన్ లో రామ్ చరణ్ అభిమాన సంఘాలు కూడా ఉన్నాయి. అప్పట్లో చరణ్ తో కలిసి వారు చేసిన సందడికి సబంధించిన ఫోటోలు, వీడియోలో తెగ వైరల్ అయ్యాయి… ఇదిలా ఉండగా తాజాగా జపాన్ లోని లేడీ ఫ్యాన్స్ రామ్ చరణ్ ను ఒక్క సారి అయినా చూడాలి అని ఏకంగా హైదరాబాద్ కు వచ్చేశారు. తమ అభిమానం జపాన్ లోనే ఆగిపోలేదని.. అవసరం అయితే చరణ్ కోసం అది ఇండియా వరకూ వస్తుంది అని నిరూపించారు..తాజాగా జపాన్ లోని చరణ్ ఫ్యాన్స్ చరణ్ ని కలిసేందుకు హైదరాబాద్ వచ్చారు. సరాసరి చరణ్ ఇంటికి వెళ్లారు.. వారందర్ని సాధరంగా ఆహ్వానించిన రామ్ చరణ్ తన ఇంట్లో కలుసుకున్నారు. వారి తెచ్చిన గిఫ్ట్స్ ని రామ్ చరణ్ కి అందించారు. ఇక వచ్చిన వారందరితో రామ్ చరణ్ ఫోటోలు దిగి ఆనందపరిచాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి.. వీటిని చూసిన ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవని చెప్పాలి..