తెలంగాణ వీణ, సినిమా : విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో శైలేష్ కొలను దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సైంధవ్’. తాజాగా ఈ చిత్రం నుంచి టీజర్ విడుదల చేశారు. టీజర్ చూస్తే కంప్లీట్ యాక్షన్ మూవీ అనేట్టుగా ఉంది. పాప సెంటిమెంట్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది.”వెళ్లే ముందు చెప్పి వెళ్లా… విన్లేదు… అంటే… భయం లేదు. లెక్క మారుద్దిరా నా కొ**ల్లారా” అంటూ వెంకీ పవర్ ఫుల్ డైలాగు చెప్పడం టీజర్ లో చూడొచ్చు. ఈ చిత్రంలో బేబీ సారా, బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధికీ, ఆర్య, శ్రద్ధ శ్రీనాథ్, రుహానీ శర్మ, ఆండ్రియా జెర్మియా, జిషు సేన్ గుప్తా, ముఖేశ్ రిషి తదితరులు ఇతర పాత్రల్లో నటించారు. నిహారిక ఎంటర్టయిన్ మెంట్ బ్యానర్ పై వెంకట్ బోయనపల్లి నిర్మిస్తున్న ‘సైంధవ్’ చిత్రం వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ చిత్రానికి సంతోష్ నారాయణ సంగీతం అందిస్తున్నారు.