తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్‌ఎస్‌లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు. తాజాగా ధర్మపురి నియోజకవర్గం వెల్గటూర్ మండలం రాంనూర్ గ్రామ ఉప సర్పంచ్ రేణుక, గ్రామ యూత్ అధ్యక్షుడు బిడారి తిరుపతితో పాటు మరో 50 మంది కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి సంకోజు తిరుమల్ ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీని వీడి మంత్రి కొప్పుల ఈశ్వర్ సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు.
మంత్రి వారికి బీఆర్ఎస్ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ..రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం అసాధ్యమన్నారు. అలవి కానీ హామీలతో ఆ పార్టీ ప్రజలను తప్పుదారి పట్టిస్తుందని విమర్శించారు.