తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. మరో ఎమ్మెల్యే పార్టీకి గుడ్ బై చెప్పేందుకు సిద్ధమవుతున్నారు. రేవంత్ రెడ్డి నివాసానికి బోధ్ ఎమ్మెల్యే బాపురావు వెళ్లడం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది. బోథ్ సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన బాపురావును బీఆర్ఎస్ అధిష్టానం పక్కనబెట్టేసి ఆ స్థానాన్ని అనిల్ జాదవ్‌కి కేటాయించింది. దీంతో ఆయన బీఆర్ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరేందుకు సిద్ధమయ్యారు.
బీఆర్ఎస్ అభ్యర్థుల జాబితాను ఇటీవలే సీఎం కేసీఆర్ విడుదల చేసవారు. తెలంగాణ భవన్‌లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి అభ్యర్థుల వివరాలను చెప్పారు.