తెలంగాణ వీణ , హైదరాబాద్ : తండ్రి లేకుండా తొలిసారిగా ఎన్నికల్లో పోటీపడుతున్న జి.సాయన్న కుమార్తె లాస్య నందిత కు సాక్షాత్తు ముఖ్యమంత్రి కేసీఆర్ కొండంత ధైర్యాన్ని నూరిపోశారు. ఏమాత్రం ఆందోళన చెందవలసిన అవసరంలేదని, తప్పకుండా విజయం సాధిస్తావంటూ ధైర్యం చెప్పారు.
సోమవారం ప్రగతి భవన్‌లో సికింద్రాబాద్ కంటోన్మెంట్ బీఆర్‌ఎస్ అభ్యర్థి లాస్య నందితకు బీ-ఫారం అందజేశారు.