Thursday, September 19, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

బీఆర్‌ఎస్‌ను వీడిన మరో కీలక నేత

Must read

తెలంగాణ వీణ , నిజామాబాద్ : నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్సీ ఆకుల లలిత పార్టీకి రాజీనామా చేశారు. తెలంగాణ మహిళా సహకారాభివృద్ధి సంస్థ చైర్మన్ పదవిని కూడా వదులుకున్నారు. ఈ మేరకు ఆమె సీఎం కేసీఆర్‌కు రాజీనామా లేఖ రాశారు. 

బీఆర్ఎస్ హయాంలో పూర్తిగా ఎమ్మెల్యేల ప్రభుత్వంగా పరిపాలన సాగుతోందని ఆకుల లలిత ఈ సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు.  స్థానిక సంస్థల పాలన ఎమ్మెల్యేల బానిస పాలనగా మారిందని దుయ్యబట్టారు. సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జడ్పీటీసీల బాధ వర్ణనాతీతమని విచారం వ్యక్తం చేశారు. ఈ అంశాలు తనను బాధించడంతో బీఆర్‌ఎస్‌ను వీడుతున్నట్టు పేర్కొన్నారు. కాగా, ఆకుల లలిత కాంగ్రెస్‌లో చేరే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you