తెలంగాణవీణ , కాప్రా ; భారత రాష్ట్ర సమితి ప్రవేశపెట్టిన మేనిఫెస్టోకు తోడు నియోజకవర్గ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి చేపట్టిన సేవా కార్యక్రమలు పార్టీ ఘన విజయాన్ని సాధించడం ఖాయమనీ నియోజకవర్గ ఎన్నికల ఇంచార్టీ రావుల శ్రీధర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. సోమవారం రాధిక చౌరస్తాలో ఏర్పాటు చేసిన ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, మాజీ అధ్యక్షులతో పాటు పార్టీ ముఖ్య నాయకులతో నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జ్ తెలంగాణ రాష్ట్ర విద్య, సంక్షేమ సదుపాయాల అభివృద్ధి సంస్థ చైర్మన్ రావుల శ్రీధర్ రెడ్డి మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిఆర్ఎస్ ప్రభుత్వం సీఎం కేసీఆర్ నేతృత్వంలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం అనేక సంక్షేమ , అభివృద్ధి కార్య క్రమాలు చేపట్టినట్టు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, రైతుబంధు, దళిత బంధు, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టిన ఘనత సీఎం కేసీఆర్ కే దక్కుతుందన్నారు. గత 60 సంవత్సరాలగా కాంగ్రెస్ పాలనలో జరగని అభివృద్ధి, గత తొమ్మిదేళ్లలో రెట్టింపు అభివృద్ధి జరిగిందన్నారు. సీఎం కేసీఆర్ దూర దృష్టితో.. భావితరాలకు బంగారు బాట వేసే దిశగా పనిచేస్తుందన్నారు. రానున్న ఎన్నికల్లో బి ఆర్ ఎస్ పార్టీ హ్యాట్రిక్ సాధిస్తుందని, ఉప్పల్ నియోజకవర్గంలో గులాబీ జెండా ఎగరవేస్తుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. నాయకులు కార్యకర్తలు సమిష్టి కృషితో లక్ష్మారెడ్డి గెలుపు దిశగా కృషి చేయాలని పిలుపుని చ్చారు. అనంతరం బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఇంటింటికి, కడప గడపకు తీసుకెళ్లి ప్రచారం చేయాలన్నారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా నన్ను గెలిపిస్తే.. కుటుంబానికి పెద్ద దిక్కుగా అందరికీ అందుబాటులో ఉండి సేవలందిస్తానని భరోసా కల్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరు శ్రీనివాస్, నియోజకవర్గ కార్పొరేటర్లు, మాజీ కార్పొరేటర్లు, డివిజన్ నాయకులు పాల్గొన్నారు.