తెలంగాణ వీణ , జాతీయం : క్రికెట్ స్టేడియంలో జై శ్రీరాం నినాదాలు చేయడాన్ని డీఎంకే నాయకుడు ఉదయనిధి స్టాలిన్ తప్పుబట్టడంపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధిని విషాన్నిచిమ్మే దోమగా బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా పేర్కొన్నారు.
గుజరాత్‌లోని నరేంద్ర మోదీ స్టేడియంలో భారత్-పాక్ మ్యాచ్ సందర్భంగా పాక్ క్రికెటర్ రిజ్వాన్ ముందు అభిమానులు జై శ్రీరాం అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యను సహించరానిదిగా పేర్కొన్నారు ఉదయనిధి. క్రీడా వేదికగా ద్వేషాన్ని చిమ్ముతున్నారని మండిపడ్డారు. ఆటలు దేశాల మధ్య సోదరభావాన్ని పెంచాలని కోరారు.
ఉదయనిధి వ్యాఖ్యలపై బీజేపీ ఘాటుగా స్పందించింది. ఉదయనిధి వ్యాఖ్యలు విద్వేషంతో కూడుకున్నవని మండిపడ్డారు. మైదానంలో నమాజ్ చేయడానికి ఆటను కాసేపు ఆపినప్పుడు మీకు ఎలాంటి అభ్యంతరం లేదా..? అంటూ ఉదయనిధిని ఉద్దేశించి బీజేపీ జాతీయ ప్రతినిధి గౌరవ్ భాటియా దుయ్యబట్టారు.