తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై హైదరాబాద్ లోని సీబీఐ కోర్టులో ఈరోజు విచారణ జరిగింది. కోర్టు విచారణకు వైసీపీ ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి, ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డి హాజరయ్యారు. తదుపరి విచారణను సీబీఐ కోర్టు నవంబర్ 3వ తేదీకి వాయిదా వేసింది. మరోవైపు చంచల్ గూడ జైల్లో ఉన్న ఉదయ్ కుమార్, శివశంకర్ రెడ్డిలను భారీ పోలీస్ బందోబస్తుతో కోర్టుకు తీసుకొచ్చారు. విచారణ వాయిదా పడిన అనంతరం మళ్లీ జైలుకు తరలించారు.