తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ విషయంలో ముఖ్యమంత్రి జగన్ తీసుకున్న చర్యలను బీజేపీ సమర్థించదని ఆ పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదినారాయణ రెడ్డి తెలిపారు. చంద్రబాబు అక్రమ అరెస్ట్ ను ఖండిస్తున్నామని చెప్పారు. చంద్రబాబుకు న్యాయం జరిగేలా చూస్తామని అన్నారు. ప్రొద్దుటూరులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అరెస్ట్ వ్యవహారంపై మాట్లాడారు. ఆ కార్యక్రమంలో కడప జిల్లా బీజేపీ అధ్యక్షుడు శశిభూషణ్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి ప్రదీప్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరోవైపు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ పై విచారణను ఏపీ హైకోర్టు ఈ నెల 18కి వాయిదా వేసింది.