తెలంగాణ వీణ , హైదరాబాద్ : రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు కాంగ్రెస్ అసలు పోటీయే కాదని ఎమ్మెల్సీ కవిత అన్నారు.. బీఆర్‌ఎస్ మ్యానిఫెస్టో చూసి ఆ రెండు పార్టీలకు దిమ్మతిరిగి పోయిందన్నారు. తమ మ్యానిఫెస్టో ఈ స్థాయిలో ఉంటుందని విపక్షాలు ఊహించలేదని వెల్లించారు అన్నివర్గాల ప్రజలను సమానంగా చూడాలన్నదే సీఎం కేసీఆర్ ఉద్దేశమని తెలిపారు. కాగ్రెస్, బీజేపీని ప్రజలెవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరన్నారు. బీఆర్‌ఎస్ మూడోసారి అధికారంలోకి రావడం పక్కా అని స్పష్టం చేశారు. తెలంగాణలోని పథకాలు దేశానికే రోల్‌మోడల్ అని చెప్పారు. దేశంలో బీఆర్‌ఎస్‌ను చూసి బీజేపీ నేర్చుకుంటున్నదని తెలిపారు.