తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ సీఎం కేసీఆర్ మనవడు, హిమాన్షూ తన తాత పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం కేసీఆర్ పాలనతో ఎన్నో సమస్యలు అంతరించిపోయాయని చెప్పారు. ‘ఒక దశాబ్డి కాలంలోనే శతాబ్ది అభివృద్ధి’ అన్న నినాదం సీఎం కేసీఆర్ పాలనకు సరిగ్గా సరిపోతుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా చేసిన పోస్ట్ వైరల్‌గా మారింది.
తెలంగాణలో తరతరాలుగా వేధిస్తున్న సమస్యలు కేసీఆర్ మెడల్ పాలనతో అంతరించిపోయాయని చెప్పారు. నల్గొండలో ఫ్లోరోసిస్, పాలమూరులో ఆకలి వలసలు, విద్యుత్ సంక్షోభంతో రైతుల ఆత్మహత్యలు, తాగు నీటి-సాగునీటి కొరత, అణగారిన వర్గాలపై వివక్ష, హైదరాబాద్‌లో అల్లర్లు, లా అండ్ ఆర్డర్ సమస్యలు, శిశు-మాతా మరణాలు వంటివన్నీ కనుమరుగయ్యాయని హిమాన్షూ గుర్తు చేశారు. నాణ్యమైన, విద్య వైద్య సేవలు అందరికీ అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ఇంకా ఎన్నో అంశాల్లో తెలంగాణ అభివృద్ధి బాటలో దూసుకుపోతోందని ప్రశంసించారు. ఫలితంతా ఇప్పుడు అందరూ ‘కార్ రావాలి.. కేసీఆర్ గెలవాలి’ అని నినదిస్తున్నారని చెప్పారు.