Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం

Must read

తెలంగాణ వీణ , హైదరాబాద్ : హైదరాబాద్‌ వనస్థలిపురంలోని గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో భారీ అగ్నిప్రమాదం జరిగింది. సోమవారం తెల్లవారుజామున గణేశ్‌ టెంపుల్‌ సమీపంలో ఉన్న ఓ బ్యాగుల దుకాణంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి షాప్‌ మొత్తానికి విస్తరించడంతో అగ్నికీలలు ఎగసిపడ్డాయి. దీంతో ఆ ప్రాంతంలో దట్టంగా పొగలు కమ్ముకున్నాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. ఉదయం వేళ ప్రమాదం జరగడంతో ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని తెలిపారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you