Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

క్రిసిల్‌ సంస్థ పేరుతోనూ తప్పుడు ప్రచారం

Must read

 తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : రాష్ట్రంలో మద్యం అమ్మకాలపై క్రిసిల్‌ సర్వే నివేదిక అంటూ శనివారం విజయ­వాడలో విలేకరుల సమావేశంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరి చూపిన కాగితాలు అసలు ఆ సంస్థకు సంబంధించిన నివేదికే కాదని తేలింది. వాటిని చూపిస్తూ (ప్రతులు మీడియా ప్రతినిధులకు ఇవ్వలేదు) ఆమె రాష్ట్ర ప్రభుత్వం, సీఎం వైఎస్‌ జగన్‌­మోహన్‌రెడ్డిపై తీవ్ర విమర్శలు గుప్పించారు.

తీరా చూస్తే.. ఆ కాగితాలు ఓ వ్యక్తి తన పరిశోధన కోసం క్షేత్రస్థాయి పరిశీలన (గ్రౌండ్‌ రిపోర్ట్‌)గా వెబ్‌సైట్‌లో రాసుకున్న అంశాలని సాక్ష్యా­ధా­రాలతో స్పష్టమైంది. ఆ కాగితాలను పురందేశ్వరి మీడియాకు చూపిస్తున్నప్పుడు తీసిన ఫొటోలోనూ అదొక ఆన్‌లైన్‌ వెబ్‌సైట్‌లో ఉంచిన గ్రౌండ్‌ రిపోర్టు అని స్పష్టంగా కనిపిస్తోంది. ఆ వ్యక్తి తన గ్రౌండ్‌ రిపోర్టును ‘నేషనల్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ అప్లైడ్‌ ఎకనామిక్‌ రీసెర్చి­(ఎన్‌సీఏఈఆర్‌)’ సంస్థకు పరిశీలనకు సమర్పించారు. ఎన్‌సీఏఈఆర్‌ ఆ రిపోర్టును తిరస్కరించింది.

ఎవరో విజిల్‌ బ్లోయర్‌ (అవి­నీతికి సంబంధించి కచ్చితమైన సమాచారం తెలి­సిన అజ్ఞాత వ్యక్తి) ఫిర్యాదు మేరకే స్కిల్‌ డెవలప్‌­మెంట్‌ కుంభకోణంపై సీఐడీ కేసు నమోదు చేసి, విచారణ జరిపి చంద్రబాబు అరెస్టు దాకా వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి వ్యా­ఖ్యానించారు. ఆమె శనివారం విజయవాడలో విలేక­రులతో మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబు కేసుపై విలేకరుల ప్రశ్నలకు స్పందిస్తూ.. ‘చంద్రబాబు అరెస్టు వెనుక బీజేపీ హస్తం లేదు. అరెస్టు చేసిన విధానంలో లోపాలు ఉన్నాయని బీజేపీ ఆనాడే చెప్పింది.

అవి­నీతి జరిగిందా లేదా అన్నది కోర్టే తేల్చాలి’ అని  అన్నారు. చంద్రబాబు ఆయన భద్రత, చికిత్స బాధ్యత ఎవ­రిదో వారినే అడగాలని అన్నారు. తనను అమిత్‌ షా పిలిచారని లోకేశ్‌ చెబుతున్న విషయాన్ని ప్రస్తావించగా.. ‘ఎవరు పిలిచారన్నది అప్రస్తుతం. లోకేశ్‌కి అమిత్‌ షా అపాయింట్‌మెంట్‌ ఇచ్చారు. చంద్ర­బాబు ఆరోగ్య స్థితి, కేసు, సెక్షన్లు, జడ్జిలు ఎవరో ఆరా తీశారు. బాబు అరెస్టులో బీజేపీ హస్తం ఉంటే వారు ఎలా కలుస్తారు?’ అంటూ బదులి­చ్చారు. ఎన్డీఏ, ఇండియా కూటములకు సమదూర­మన్న లోకేశ్‌ వ్యాఖ్యలపై స్పందించనని చెప్పారు.

రాష్ట్రంలో మద్యం తయారీ, నాణ్యత, అమ్మకాలు, ఇసుక, మైనింగ్‌లో అక్రమాలు జరిగాయని,  సీఎంజగన్‌ నిజాయితీని నిరూ­పించుకునేందుకు సీబీఐతో విచారణ చేయించుకోవాలని పురందేశ్వరి సవాల్‌ చేశారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న 20 మద్యం తయారీ సంస్థలలో 12 చంద్రబాబు కాలంలోనే అను­మతులు పొందాయని, అయితే 2019 తర్వాత  మద్యం తయారీదారుల్ని బెదిరించి వైఎస్సార్‌సీపీ నేతలు వాటిని లాక్కున్నారని ఆరోపించారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you