తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో కర్నూలు జిల్లా అధికారులు అత్యుత్సాహం ప్రదర్శించారు. సీఎం సభకు అడ్డుగా ఉంటుందని ఏకంగా దుర్గామాత మండపాన్ని తొలగించారు. అధికారుల నిర్వాకంపై స్థానికులు, దుర్గామాత భక్తులు తీవ్రంగా మండిపడుతున్నారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జిల్లాలోని ఎమ్మిగనూరులో దసరా శరన్నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా వీవర్స్ కాలనీ మైదానంలో భక్తులు దుర్గామాత మండపాన్ని ఏర్పాటు చేశారు.
అయితే, ఈ నెల 19న సీఎం జగన్ ఎమ్మిగనూరులో పర్యటించనున్నారు. ఈ మైదానంలో సీఎం సభ జరగనుంది. ఈ సభకు మండపం అడ్డుగా మారుతుందని భావించిన అధికారులు.. దుర్గమ్మ మండపాన్ని తొలగించారు. ఆ సామాగ్రిని ఆటోల్లో అక్కడి నుంచి తరలించారు. దీనిపై భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.