Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

రెండు భాగాల ట్రెండ్‌ లో ‘కెప్టన్‌ మిల్లర్‌’?

Must read

తెలంగాణ వీణ, సినిమా : చిత్రపరిశ్రమలో ప్రస్తుతం రాబోయే సినిమాలు రెండు భాగాల్లో రూపొందడం ట్రెండ్‌గా మారింది. ఇప్పుడు ‘కెప్టన్‌ మిల్లర్‌’ చిత్రం కూడా ఈ బాటలోనే పయనించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ కథానాయకుడు ధనుష్‌ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అరుణ్‌ మాథేశ్వరన్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ప్రియాంక మోహన్‌, శివరాజ్‌ కుమార్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌తో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు మొదలైయ్యాయి. తాజాగా ఈ సినిమాను రెండు భాగాలుగా రూపొందిస్తున్నట్లు సమాచారం. 1980కాలం నాటి కథల నేపథ్యంలో యాక్షన్‌ అడ్వెంచర్‌గా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. సెంథిల్‌ త్యాగరాజన్‌, అర్జున్‌ త్యాగరాజన్‌ నిర్మాతలు. ఈ సినిమా డిసెంబరు 15న విడుదల కానుంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you