తెలంగాణ వీణ , హైదరాబాద్ : పార్టీ మేనిఫెస్టో ప్రకటన.. బీఫామ్ లు అందజేత నేపథ్యంలో తెలంగాణ భవన్ కు బీఆర్ఎస్ నేతలు క్యూ కట్టారు. ఇప్పటికే దాదాపు నేతలంతా చేరుకున్నారు. కాసేపట్లో తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ రానున్నారు. పార్టీ మేనిఫెస్టో విడుదల చేసి, అభ్యర్థులకు బీఫామ్ లు అందజేయనున్నారు. ఆపై ఎన్నికల ప్రచారంపై పార్టీ అభ్యర్థులకు దిశానిర్దేశం చేస్తారని తెలుస్తోంది. ఆపై సాయంత్రం హుస్నాబాద్ లో జరగనున్న సభలో కేసీఆర్ పాల్గొంటారు. హుస్నాబాద్ నుంచే ఎన్నికల ప్రచారం మొదలుపెడతారని సమాచారం.
తెలంగాణ భవన్ వద్ద మంత్రి మల్లారెడ్డి మీడియాతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ ప్రజల మనిషి అని.. ఈ రోజు విడుదల చేయబోయే మేనిఫెస్టోలో ప్రజల సంక్షేమానికే ఆయన ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారు. ఇచ్చిన హామీలను అమలు చేయడంతో పాటు ఎలాంటి హామీ ఇవ్వని అంశాలనూ ఆయన చేసి చూపిస్తారని వివరించారు.