Tuesday, December 24, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మనసుని హత్తుకునేలా ‘హాయ్‌ నాన్న’ టీజర్‌

Must read

తెలంగాణ వీణ, సినిమా : నాని తండ్రి పాత్రలో నటిస్తోన్న ఫీల్‌గుడ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘హాయ్‌ నాన్న’. మృణాల్‌ ఠాకూర్‌ కథానాయిక. బేబీ కియారా ఖన్నా, శ్రుతిహాసన్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు. తండ్రీ కుమార్తెల సెంటిమెంట్‌తో రూపుదిద్దుకుంటోన్న ఈ చిత్రానికి శౌర్యువ్‌ దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్‌ను చిత్రబృందం విడుదల చేసింది. సరదాగా సాగుతోన్న తండ్రీ కుమార్తెల జీవితంలోకి ఒక యువతి ఎంట్రీ ఇవ్వడం.. అతడితో ఆమె ప్రేమలోపడటం.. వంటి సన్నివేశాలతో ఈ టీజర్‌ను తీర్చిదిద్దారు. ఆమె ప్రేమను అతడు అంగీకరించాడా? తన కుమార్తె కోసం అతడు ఏం చేశాడు? అనే ఆసక్తికర అంశాలతో ఈ సినిమా సిద్ధమైనట్లు తెలుస్తోంది.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you