తెలంగాణ వీణ, హైదరాబాద్ : దేవీ నవరాత్రులు, దుర్గ పూజ, దసరా పండగ నేపథ్యంలో నగరం నుంచి వివిధ రాష్ట్రాల వారు సొంత ఊళ్లకు బయలుదేరుతుండడంతో రైళ్లు కిక్కిరిసిపోతున్నాయి. శనివారం సాయంత్రం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో విపరీతమైన రద్దీ నెలకొంది. స్టేషన్ ప్రాంగణమంతా ప్రయాణికులతో నిండిపోయిది. రైలు బోగీలో నిలబడేందుకూ నానా ఇబ్బందులు పడ్డారు. సికింద్రాబాద్ నుంచి గువాహటి వెళ్లే ఎక్స్‌ప్రెస్ వద్ద నెలకొన్న రద్దీ వల్ల ప్రయాణికులు చాల ఇబ్బందులు పడ్డారు..