తెలంగాణ వీణ , హైదరాబాద్ : అగ్రకుల దురహంకారం, డబ్బు మదంతో బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలను అవమానించడం, కించపరిచేలా మాట్లాడటం పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డికి అలవాటుగా మారిందని మున్నూరుకాపులు, బీసీ సంఘాల నేతలు ఆగ్రహించారు. ఖబడ్దార్ రేవంత్ అని హెచ్చరించారు. శనివారం పొన్నాల లక్ష్మయ్యపై రేవంత్ చేసిన అనుచిత వ్యాఖ్యల పట్ల మున్నూరుకాపులు, బీసీ సంఘాల నేతలు భగ్గుమన్నారు. పలుచోట్ల రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశార
మున్నూరుకాపు సమాజానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. లేకుంటే ఎక్కడికక్కడ అడ్డుకుంటామని, కాంగ్రెస్ అధిష్ఠానం ఆయనపై చర్యలు తీసుకోకపోతే ఆ పార్టీకి ఎన్నికల్లో బుద్ధి చెప్తామని హెచ్చరించారు. పొన్నాల లక్ష్మయ్యపై చేసిన వ్యాఖ్యలను వెంటనే ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తూ మున్నూరుకాపు సంఘం నేతలు కరీంనగర్, మంచిర్యాల, ఖమ్మంలో, హైదరాబాద్‌లో బీసీ సంఘం నేతలు.. రేవంత్ దిష్టిబొమ్మలను దహనం చేశారు.
ఓటుకు నోటు కేసులో డబ్బులు పంచుతూ దొరికిన దొంగ రేవంత్ అని మండిపడ్డారు. పొన్నాల లక్ష్మయ్య కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయలేదని, కేవలం బీసీలకు అన్యాయం జరుతుగుతున్నదని, పార్టీలో గౌరవం దక్కడం లేదని ఆవేదనతో రాజీనామా చేస్తే.. వారించాల్సింది పోయి రేవంత్ అహకారంతో మాట్లాడారని ధ్వజమెత్తారు. పదవుల కోసం రేవంత్ దేనికైనా ఒడిగడుతాడని దుయ్యబట్టారు. రేవంత్ బీసీ నాయకులను అణగదొక్కుతున్నారని, పార్టీ నుంచి వెళ్లిపోయేలా చేస్తున్నారని మండిపడ్డారు.రేవంత్ తన హోదాను మర్చిపోయి పొన్నాలపై అహంకార భావంతో మాట్లాడటం దారుణమని వేములవాడ బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు మండిపడ్డారు.