తెలంగాణ వీణ, హైదరాబాద్ : జగద్గిరిగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలో శ్రీనివాస్ నగర్ లోని నవ్య ఫోటో స్టూడియోలో కరెంట్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్టూడియో యజమాని (రఘునందన్) పని నిమిత్తం బయటకు వెళ్లిన సమయంలో షార్ట్ సర్క్యూట్ వల్ల భారీ అగ్ని ప్రమాదం జరిగింది అని,స్థానికులు నీళ్లతో మంటలను అదుపు చేశారు అని, ఈ ప్రమాదంలో ఫోటో స్టూడియోలో భారీగా ఫర్నిచర్, స్టూడియో పరికరాలు కాలిపోయాయి అని, దాదాపు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగి ఉండొచ్చని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాం అని తెలిపారు.