తెలంగాణ వీణ , హుసునాబాద్ : హుస్నాబాద్ పట్టణంలో ఆదివారం సీఎం బహిరంగ సభ జరుగుతుందని జడ్పీచైర్మన్ మారపల్లి సుధీర్ కుమార్ తెలిపారు. శనివారం మండలంలోని ముల్కనూరులో మండల ఇన్‌చార్జీలు మేడిపల్లి శోభన్‌బాబు, బోయినపల్లి ప్రతిక్‌రావుతో కసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ మాట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని సీఎం కేసీఆర్ హుస్నాబాద్ నుంచే మొదలుపెడుతున్నారన్నారు. సమైక్య రాష్ట్రంలో నిత్యం కరెంటుకోతలు, సాగు, తాగు నీరు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ మొదటి ప్రాధాన్యం కరెంటు, సాగు, తాగునీటికే ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రజలకు కరెంటు కోతలు లేకుండా 24 గంటలు సరఫరా చేస్తున్నారన్నార
చెరువుల్లో పూడికతీత, కాళేశ్వరం, పాలమూరు వంటి పథకాలను ప్రవేశపెట్టి చెరువులన్నీ నింపుతున్నారన్నారు. దాదాపు ప్రతి జిల్లాలో మెడికల్ కళాశాలలు, గురుకులాలు ప్రవేశపెట్టి విద్యార్థులకు కార్పొరేట్‌కు దీటుగా విద్యనందిస్తున్నారని తెలిపారు. పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ నిరంతరం పాటుపడుతున్నారన్నారు. మూడోసారి కేసీఆరే ముఖ్యమంత్రి అవుతారని ధీమా వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో మేనిఫెస్టో విడుదల చేసి ఆదివారం మధ్యాహ్నం సీఎం కేసీఆర్ బహిరంగ సభకు హాజరవుతారని తెలిపారు. సభకు లక్షమందికి పైగా ప్రజలు వచ్చేందుకు సిద్ధమవుతున్నారన్నారు. సమావేశంలో ఎంపీపీ జక్కుల అనిత, జడ్పీటీసీ వంగ రవి, మాజీ ఎంపీపీ సంగ సంపత్, వైఎస్ ఎంపీపీ మాడుగుల ఎజ్రా, సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షుడు గూడెల్లి రాజిరెడ్డి, ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు మండల సురేందర్, బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మార్పాటి మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు మాడుగుల కొంరయ్య .