తెలంగాణ వీణ , జాతీయం : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై మళ్లీ ఈనెల 16వ తేదీన పాదయాత్ర చేపట్టనున్నారు. ‘ఎన్‌మన్‌ఎన్ మక్కళ్’ పేరుతో రామ నాథపురం జిల్లా రామేశ్వరంలో జూలై 28వ తేదీన తొలి విడత పాదయాత్ర ప్రారంభించిన అన్నామలై.. రెండో విడత పాదయాత్రను నీలగిరి జిల్లా కున్నూరులో సెప్టెంబరు 28న ముగించారు. కోయంబత్తూరు జిల్లా మేట్టుపాళయం నుంచి మూడో విడత పాదయాత్రను ఈనెల 6వ తేదీ ప్రారంభం చాలనుకున్నారు. కానీ ఆయన అస్వస్థతకు గురి కావడంతో వైద్యుల సలహా మేరకు విశ్రాంతి తీసుకున్నారు. ఆరోగ్యం కుదుటపడడంతో మళ్లీ ఆయన తన పాదయాత్రను ఈనెల 16వ తేదీన కోయంబత్తూరు జిల్లా అవినాశిలో ప్రారంభించి నవంబరు 9న తిరుచ్చి జిల్లా లాల్గుడిలో పూర్తి చేస్తారని పార్టీ వర్గాలు తెలిపాయి.