తెలంగాణ వీణ , జాతీయం : ఇంటి ముందు నీళ్లు చల్లొందన్నందుకు పొరుగింటి వ్యక్తి ఒక దళితుడిని తుపాకీతో కాల్చి చంపిన దారుణ ఘటన బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం రమ్నేవాజ్ రాయ్‌దాస్(35) స్థానిక మార్కెట్లో కూలీగా పని చేసేవాడు. అతడి ఇంటి పక్కన ఉండే రాహుల్ కుమార్ బుధవారం రాత్రి రాయ్‌దాస్ ఇంటి ముందు నీళ్లు చల్లాడు. తమ ఇంటి ముందు నీళ్లెందుకు చల్లారని రాయ్‌దాస్ రాహుల్ కుటుంబాన్ని ప్రశ్నించాడు. ఈ విషయమై మాట మాట పెరగడంతో కోపం వచ్చిన రాహుల్ కుమార్ తుపాకీతో రాయ్‌దాస్‌ను కాల్చడంతో అతడు అక్కడిక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మృతుడి కుటుంబానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా గాయపడ్డారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.