తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : జై జగన్ అంటూ విద్యార్థినులు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఒంగోలులోని పవిత్ర కాలేజీ క్యాంపస్ మార్మోగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాతృమూర్తి వైఎస్ విజయమ్మ ప్రైవేటు కార్యక్రమంలో భాగంగా ఒంగోలు వచ్చారు. స్థానిక పవిత్ర క్యాంపస్ ఎదురుగా ఉన్న ఒక ప్రముఖ వ్యక్తితో మాట్లాడి బయటకు వస్తుండగా క్యాంపస్‌లో ఉన్న విద్యార్థినులు ఒక్కసారిగా బయటకు వచ్చారు. ఒక్కసారిగా వారందరినీ తోసుకుంటూ ముందుకు వచ్చారు. వారి ఉత్సాహాన్ని చూసిన విజయమ్మ విద్యార్థినులను దగ్గరకు తీసుకున్నారు.