తెలంగాణ వీణ , ఆదిలాబాద్ : జ్వరంతో ఆదిలాబాద్ రూరల్ మండలం టెకిడిగూడ గ్రామానికి చెందిన బీర్షావ్–సూర్యకళ దంపతుల కుమార్తె రాయిసిడాం జంగుబాయి (14) మృతి చెందింది. వివరాలు.. జంగుబాయి మండలంలోని మామిడిగూడ గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. మూడు రోజుల కిందట ఆమెకు జ్వరం రాగా కుటుంబ సభ్యులు ఇంటికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమించి జంగుబాయి శుక్రవారం మృతి చెందింది. కాగా, పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంతోనే తమ కూతురు మృతి చెందినట్లు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు.
జిల్లా అధ్యక్షుడు గోడం గణేశ్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. బాధ్యులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన చేపడతామని హెచ్చరించారు.