తెలంగాణ వీణ, సికింద్రాబాద్ : ఎన్నికల కోడ్ నేపథ్యంలో జనరల్ బజార్ లోని బంగారు వ్యాపారస్తులను మో0డా మార్కెట్ పోలీసులు ఇబ్బందులకు గురిచేస్తున్నారని వ్యాపారస్తులు పాట్ మార్కెట్ లో ఆందోళనకు దిగారు.. ఎన్నికల కోడ్ తనిఖీల పేరుతో బంగారు దుకాణాలలో వచ్చి వ్యాపారస్తులను ప్రశ్నిస్తూ ఇబ్బందులు పడుతున్నారని వ్యాపారస్తులు ఆరోపిస్తు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.. పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఆందోళన చేస్తున్న వ్యాపారస్తుల వద్దకు చేరుకుని సమస్యను పరిష్కరించారు.. ఎన్నికల కోడ్ అమల్లో వచ్చినప్పటికీ పోలీసులు దుకాణాలకు వెళ్లి దురుసుగా ప్రవర్తించకూడదని ఆయన సూచించారు.. వ్యాపారస్తులకు నష్టం వాటిల్లేలా పోలీసులు వ్యవహరించడం సరికాదని వారికి భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని అన్నారు.. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని సూచించారు..