తెలంగాణ వీణ , రంగారెడ్డి : బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ఇష్టపడుతున్నారని బీఆర్‌ఎస్ పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పెద్దఅంబర్‌పేట మున్సిపాలిటీ 15వ వార్డు పరిధి మర్రిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ ముఖ్య నాయకులు బీఆర్‌ఎస్‌లో చేరారు. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ..నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. ప్రతి గ్రామానికి రూ.కోట్లలో నిధులు కేటాయించి, మౌలిక వసతులు కల్పిస్తున్నామని పేర్కొన్నారు.
పార్టీలో చేరినవారిలో కాంగ్రెస్ నాయకులు నక్క బుచ్చయ్యగౌడ్, సీక కృష్ణాగౌడ్, నక్క మహేందర్‌గౌడ్, గౌడ సంఘం డైరెక్టర్ నక్క అమరేందర్‌గౌడ్, నక్క పాండుగౌడ్, నక్క హనుమంతుగౌడ్, నక్క వేణుగౌడ్, సీక శంకరయ్యగౌడ్, సీక స్వామి గౌడ్, సీక దాసుగౌడ్, నక్క రాజుగౌడ్, నక్క హరిబాబు గౌడ్ తదితరులు ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి గెలుపు కోసం కృషి చేస్తామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.