తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : వ్యవసాయానికి నాలుగు గంటల విద్యుత్ ఎలా సరిపోతుందని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి ప్రశ్నించారు. బుధవారం మండలంలోని మర్రిపల్లిలో ఇటీవల మరణించిన గోగుల పెంచలమ్మ, చిట్టేపల్లిలోని కోవూరు జయమ్మ, సుబ్బమ్మ కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. అనంతరం టీడీపీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ ఇప్పటికే మంత్రి కాకాణి తన అనుచరులతో కండలేరు వద్దకు వెళ్లి లిఫ్టు ద్వారా నీళ్లు అవసరం లేదని కొందరి చేత చెప్పించి, కండలేరు లిఫ్ట్‌నకు మంగళం పాడేసారన్నారు. పొదలకూరు యార్డ్‌లోని నిమ్మకాయల కొట్లను నిబంధనలకు విరుద్థంగా వేలం నిర్వహించారన్నారు. మర్రిపల్లిలోని సుధాకర్‌కు చెందిన గణేష్ వేబ్రిడ్జిపై కక్ష సాధింపు చర్యలు చేపడుతున్నారని ఆయన పేర్కొన్నారు.