కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. కాంగ్రెస్ పార్టీ బీసీలకు అన్యాయం చేస్తుందని, బజారులో గొడ్డును అమ్ముకున్నట్టు టికెట్లు అమ్ముకుంటున్నారని ఆరోపిస్తూ ఆ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య రాజీనామా చేశారు. ఈ మేరకు రాజీనామా లేఖను ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు పంపారు. కాంగ్రెస్ పార్టీ మూల సిద్ధాంతానికి భిన్నంగా వ్యక్తి స్వామ్యం నడుస్తుందని, ఉదయ్ పూర్ డిక్లరేషన్ అమలు చేసే పరిస్థితి లేదని లేఖలో పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీకి భూమి పుత్రులుగా ఉన్న వాళ్లక అవమానాలు, కొత్తగా వచ్చిన వాళ్లకు పెద్దపీట వేస్తూ పాత వాళ్లు ఉనికి కోల్పోయేలా చేస్తున్నారని పేర్కొన్నారు. కనీసం పార్టీ అంశాలు కూడా చర్చించేందుకు అవకాశం ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జనగామ టికెట్ విషయంలో తీవ్ర అసంతృప్తితో ఉన్న పొన్నాల రాజీనామా అనంతరం ఎవరికి అందుబాటులో లేకుండా పోయారు.