తెలంగాణ వీణ, సినిమా : యంగ్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.సీరియల్ నటిగా కెరీర్ ను ప్రారంభించిన పాయల్ రాజ్ పుత్ పంజాబీ, హిందీ చిత్రాలతో నటిగా మారింది.అయితే కొన్నాళ్లుగా ఈ ముద్దుగుమ్మ సినీ కెరీర్ అంతా సాఫిగా సాగడం లేదు.తమిళంలోకీ ఎంట్రీ ఇచ్చినా కూడా అక్కడా సరైన సినిమా పడలేదు. నటించిన చిత్రాలూ ఆశించిన విజయాలను ఇవ్వలేదు..దీంతో మరోసారి తన మొదటి సినిమా ‘ఆర్ ఎక్స్100’ డైరెక్టర్ అజయ్ భూపతితో చేతులు కలిపింది.వీరిద్దరి కాంబోలో ప్రస్తుతం ‘మంగళవారం’ సినిమా రూపుదిద్దుకుంటోంది. ఈ చిత్రం లో పాయల్ లుక్ ఎంతగానో ఆకట్టుకోబోతోంది. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, సాంగ్స్ సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఈ క్రమంలో ప్రమోషన్స్ ను కూడా ఎంతో ఆసక్తికరంగా నిర్వహిస్తున్నారు.పాయల్ ఈ సినిమాపైనే ప్రస్తుతం భారీగా ఆశలు పెట్టుకుంది. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఈ క్రమంలోనే పాయల్ కూడా తన అభిమానులను మరింతగా ఆకట్టుకునేందుకు నెట్టింట తెగ సందడి చేస్తోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో ఫొటోషూట్లు చేస్తూ ఎంతగానో ఆకట్టుకుంటోంది.తాజాగా ఈ ముద్దుగుమ్మ బ్లాక్ అవుట్ ఫిట్ లో దర్శనమిచ్చింది. హాట్ థైస్ అందాలతో మతులు పోగొట్టింది. లేక్ వ్యూ పాయింట్ వద్ద కిర్రాక్ ఫోజులిస్తూ కుర్ర గుండెల్ని దోచుకుంది. గ్లామర్ మెరుపులతోనూ మైమరిపించింది. ఈ భామ అదిరిపోయే స్టిల్స్ కు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఎంతగానో ఫిదా అవుతున్నారు.