తెలంగాణ వీణ, హైదరాబాద్ : కుషాయిగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో కాప్రా విజయ స్కూల్ దగ్గరలో గత 3నెలలుగా పక్కన నిలిపి ఉంచిన బస్సులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి.బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు గమనించి వెంటనే ఫైర్ ఇంజన్ కు సమాచారం అందించారు.ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలు అదుపులోకి తెచ్చారు.సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఆకతాయిల పనా లేక కావాలనే బస్సుకు నిప్పు పెట్టారా అనే కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు.