తెలంగాణ వీణ , ఉప్పల్ : బీఆర్‌ఎస్ టికెట్ దక్కకపోవడంతో ఉప్పల్ ఎమ్మెల్యే భేతి సుభాష్‌రెడ్డి అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఆయన బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఉప్పల్ నియోజకవర్గ బీఆర్‌ఎస్ అభ్యర్థిగా బండారి లక్ష్మారెడ్డికి ఆ పార్టీ టికెట్ ఇచ్చింది. ఇక్కడి నుంచి టికెట్ కోసం సిట్టింగ్ ఎమ్మెల్యే సుభాష్‌రెడ్డి ఎన్నో ప్రయత్నాలు చేసినా ఫలితం దక్కలేదు. కొన్ని రోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన బీజేపీలో చేరేందుకు ఆ పార్టీ అగ్రనేతలతో చర్చలు జరిపినట్లు సమాచారం.