తెలంగాణ వీణ , సినిమా : సినిమాలతో ఏమాత్రం సంబంధం లేని కుటుంబం నుంచి వచ్చి, అగ్రస్థానానికి ఎదిగిన నటి సమంత. హీరోయిన్ గా టాప్ పొజిషన్ కు చేరుకున్న ఆమె… నాగచైతన్యను ప్రేమ వివాహం చేసుకుని అక్కినేని వారి కోడలు అయింది. చైతన్య మీద తనకున్న అపారమైన ప్రేమతో ఆయన పేరును తన ఒంటి మీద టాటూగా వేయించుకుంది. ఆ తర్వాత విభేదాల కారణంగా వారు వైవాహిక జీవితానికి దూరమయ్యారు. విడాకులు తీసుకుని ఎవరి జీవితాన్ని వారు గడుపుతున్నారు.
విడిపోయినప్పటి నుంచి ఇప్పటి వరకు నాగచైతన్యను సమంత ఒక్కసారి కూడా కలవలేదు. ఇప్పుడు చైతూ ఆనవాళ్లు కూడా తన ఒంటి మీద లేకుండా చెరిపేసుకుంది. ‘చై’ పచ్చబొట్టును తొలగించుకుంది. రెండో రోజుల క్రితం దుబాయ్ లోని ఓ కార్యక్రమానికి సమంత హాజరయింది. ఈ ఈవెంట్ లో పింక్ శారీలో సామ్ మెరిసిపోయింది. ఈ ఈవెంట్ సందర్భంగా ఆమె టాటూను తొలగించుకున్నట్టు అర్థమయింది. చై టాటూను సామ్ తొలగించుకున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.