తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఏపీ జల వనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు అన్నారు బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, త్వరలో ఎన్నికలు రాబోతున్నాయని.. 175 స్థానాలు గెలుచుకోవాలన్న లక్ష్యంతో ఉన్నామన్నారు.
బాబు, లోకేష్ ఇద్దరూ వేలకోట్లు దోచుకున్నారు. ఎన్నికల ముందు కక్ష సాధింపు ఏంటి?. ఆధారాలు ఉన్నాయి కాబట్టే అరెస్ట్ చేశారు. టీడీపీ నాశనం అవ్వడానికి కారణం లోకేషే. టీడీపీ నేతలు ఇప్పటికైనా గమనించాలి. నోరు పారేసుకోకుండా ఒళ్లు జాగ్రత్తగా పెట్టుకోవాలి. పవన్ కళ్యాణ్ ఏ బలం ఉందని టీడీపీకి మద్దతిస్తాడు. టీడీపీని కాపాడటం ఎవరి వల్లా కాదు’’ అని మంత్రి వ్యాఖ్యానించారు.