తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : టీడీపీ అధినేత చంద్రబాబుకు ఏపీ హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు ముందస్తు బెయిల్ మంజురు చేసింది. ఇన్నర్ రింగ్ రోడ్డు, అంగళ్లు కేసుల్లో చంద్రబాబు పెట్టుకున్న ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు విచారించింది. చంద్రబాబు తరపున న్యాయవాది దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉత్వర్వులు ఇవ్వాలని కోరారు. కేసుల విచారణకు సహకరిస్తామని తెలిపారు. ఈ క్రమంలో రింగ్ రోడ్డు కేసులో చంద్రబాబుకు సోమవారం వరకు హైకోర్టు ముందస్తు మంజూరు చేసింది. అంగళ్లు కేసులో రేపటి వరకు అరెస్ట్ చేయవద్దని సీఐడీని ఆదేశించింది.