తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్‌మెంట్ మార్పుకి ఒత్తిడి చేశారా లేదా?. మీరు మంత్రి అవ్వగానే మంత్రి వర్గ ఉప సంఘంలో ఎందుకు చేర్చారు?. మంత్రి వర్గ ఉప సంఘంలో ఇతర సభ్యులను ఒత్తిడి చేశారా కదా..?. హెరిటేజ్, లింగమనేని, నారాయణ భూములకు లబ్ధి చేసేలా అలైన్‌మెంట్ ఎందుకు మార్చారు?. ఇన్నర్ రింగ్ రోడ్డు భూసేకరణ పరిహారాన్ని భారీగా పెంచడంలో మీ పాత్ర ఉంది కదా?. భూ సేకరణ వ్యయాన్ని 210 కోట్లు అదనంగా ఎందుకు పెంచారు?. లింగమనేని రమేష్ మీకు ఎందుకు ఇల్లు ఉచితంగా ఇచ్చారు’’ అంటూ లోకేష్‌ను సీఐడీ అధికారులు ప్రశ్నించారు.
కాగా, ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో ఏ14గా ఉన్న లోకేశ్.. తొలిరోజు పొంతనలేని సమాధానాలు చెప్పారు. నిన్న ఉదయం 10 నుంచి సాయంత్రం 5 వరకు సీఐడీ విచారించిన సంగతి తెలిసిందే. లోకేష్‌కు 30 ప్రశ్నలు వేసిన సీఐడీ అధికారులు.. హెరిటేజ్‌లో డైరెక్టర్‌గా ఉన్న సమంయలో లోకేష్ తీసుకున్న నిర్ణయాలపై ప్రశ్నించారు.