తెలంగాణ వీణ , హైదరాబాద్ : రాష్ట్రంలో బీఆర్‌ఎస్ హ్యాట్రిక్ విజయం ఖాయమని, పార్టీ కార్యకర్తలు, నాయకులు కలసి కట్టుగా పార్టీ విజయానికి కృషి చేయాల్సిన అవసరం ఉందని తాండూరు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని వైస్‌ఎంపీపీ స్వరూప వెంకట్‌రాంరెడ్డి, మల్కాపూర్, చెన్‌గేష్‌పూర్, సిరిగిరిపేట, జినుగుర్తితోపాటు పలు గ్రామాల్లో బీఆర్‌ఎస్ పార్టీ నాయకులను, కార్యకర్తలను ఆత్మీయంగా పకరించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధి కోసం సీఎం కేసీఆర్ చేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల్లోకి విస్త్రతంగా తీసుకెళ్ళాలని పిలుపునిచ్చారు. తాండూరులో బీఆర్‌ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఉందన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు కష్టపడి పని చేస్తే, పార్టీ ఎప్పటికైనా గుర్తిస్తుందని తెలిపారు. 70 ఏండ్లలో చేయలేని అభివృద్ధిని ఎమ్మెల్యేగా తాను చేసి చూపించానని వివరించారు. అభివృద్ధి, సంక్షేమ ఫలాలు ప్రజలకు వివరించాలని తెలిపారు.