తెలంగాణ వీణ , మల్కాజిగిరి: బిఆర్ఎస్ ఉద్యమ నాయకుడు యాప్రాల్ సాయికుమార్ యాదవ్ బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినట్టు పేర్కొన్నారు. తన రాజీనామా పత్రాన్ని కార్యనిర్వాక అధ్యక్షుడు కేటీఆర్ కు పంపినట్లు తెలిపారు. తెలంగాణ ఉద్యమం నుంచి పార్టీ జెండాలు మోసిన తగిన గుర్తిపు లభించలేదని ,ఇతర పార్టీల నుంచి వచ్చిన వారికే పదవులు కట్టబెడుతున్నారని విమర్శించారు . తనకు తగిన గుర్తింపు కలిపిస్తామని అధిష్టాన నాయకులు కెటిఆర్ , హామీఇచ్చి పట్టించుకోలేదన్నారు . రాష్ట్రం ఏర్పడిన తర్వాత టిఆర్ఎస్ పార్టీ అభివృద్ధి కోసం శక్తివంచన లేకుండా కృషి చేసినా తమకు పదవుల ఆశ చూపుతూ పని చేయించుకున్నారని ఇప్పుడు ఇతర పార్టీల నుండి వచ్చిన వారికి పెద్దపీట వేయడం తమను గుర్తించకపోవడంతో పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.