తెలంగాణ వీణ , రాష్ట్రీయం రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు మరియు గనుల శాఖ మంత్రి డాక్టర్ పట్నం మహేందర్ రెడ్డి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.మున్నా మొయినాబాద్ మండలం అజిత్ నగర్ లో రోడ్డు ప్రమాదం లో మహిళ మృతి చెందిన సందర్భంగా అటుగా వెళుతూ ప్రమాదవ బాధితులను ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించి ము చెందిన మహిళ కుటుంబీకులకు సహాయం చేసిన విషయం మరొక ముందే వికారాబాద్ జిల్లా పెద్దముల్ మండలము కందనెల్లి గ్రామం శివారులో బైకుపై వెళుతున్న యువకులకు టిప్పర్ ఢీకొనడంతో రోడ్డుపై ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యారు.అదే సందర్భంగా బషీరాబాద్ జడ్పిటిసి శ్రీనివాస్ రెడ్డి తల్లి అంత్యక్రియలలో పాల్గొనేందుకు వెళుతున్న మంత్రి ప్రమాదాన్ని గమనించారు.వెంటనే కాన్వాయ్ హ్యాపీ ప్రమాద స్థలానికి చేరుకున్నారు.108 కు సమాచారం అందించి అది వచ్చేంతవరకు అక్కడే నిల్చుకోండి బాధితుని ఆసుపత్రికి దగ్గరుండి తరలించారు.ప్రమాదానికి గురువైన యువకుని వివరాలను తెలుసుకొని అతనికి అవసరమైన మంచి వైద్యాన్ని అందించాలని తాండూర్ వైద్యాధికారులకు మంత్రి ఆదేశించారు.మంత్రి అవునత్యానికి ఆ ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఆదేశించారు.
ప్రతి ఒక్కరు రోడ్డు నిబంధనలను పాటించాలని మంత్రి మహేందర్రెడ్డి ప్రజలకు సూచించారు.
నిబంధనలను అతిక్రమిస్తే ప్రమాదాలు తప్పవని అన్నారు.