తెలంగాణ వీణ , హైదరాబాద్ : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో జనగామ ఆశావహులతో మంత్రి కేటీఆర్ సమావేశమయ్యారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి, ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి మధ్య కేటీఆర్ సయోధ్య కుదిర్చారు. పల్లా రాజేశ్వర్ రెడ్డిని గెలిపించాలని జనగామ నేతలకు కేటీఆర్ సూచించారు. ఈ సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపునకు కలిసి పని చేయాలని ముత్తిరెడ్డి పిలుపునిచ్చారు.