తెలంగాణ వీణ , ఏపీ బ్యూరో : స్కిల్ స్కామ్ కేసులో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుకు మరో ఎదురుదెబ్బ తగిలింది. బెయిల్ కోసం చంద్రబాబు దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణకు హైకోర్టు నిరాకరించింది. చంద్రబాబుకు సోమవారం ఏసీబీ కోర్టులో కూడా చుక్కెదురైంది. బెయిల్ కోసం బాబు వేసిన పిటిషన్‌ను ఏసీబీ కోర్టు కొట్టివేసింది.
కాగా, స్కిల్ స్కామ్ కేసులో చంద్రబాబును సెప్టెంబర్ 9న ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. అప్పటి నుంచి నెల రోజులుగా ఆయన జైల్లోనే ఉన్నారు. బాబును అరెస్ట్ చేయించిన వైసీపీ సర్కారు తీరుపై పలువురు విమర్శలు చేస్తున్నారు.