తెలంగాణ వీణ , జాతీయం : దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైన వేళ ఆమ్ ఆద్మీ పార్టీ నేతలకు షాక్‌లు తగులుతున్నాయి. తాజాగా ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ తనిఖీలు చేపట్టింది. దీంతో, ఢిల్లీలో రాజకీయం మరోసారి రసవత్తరంగా మారింది. ఈ క్రమంలో ఈడీ సోదాలపై ఆప్ నేతలు మండిపడుతున్నారు.
వివరాల ప్రకారం.. ఢిల్లీలో ఆప్ నేతల ఇండ్లపై కేంద్ర దర్యాప్తు సంస్థల దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ఆప్ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్ ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. కాగా, అమానతుల్లా ఢిల్లీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్‌గా ఉన్న సమయంలో జరిగిన అక్రమ నియామకాలకు సంబంధించి సీబీఐ, ఏసీబీ నమోదు చేసిన కేసుల ఆధారంగా ఈడీ దర్యాప్తు చేస్తున్నది. ఆప్ ఎమ్మెల్యే మనీ లాండరింగ్‌కు పాల్పడ్డారనే కోణంలో విచారిస్తున్నది. ఇందులో భాగంగా మంగళవారం తెల్లవారుజాము నుంచి ఢిల్లీలోని ఆయన నివాసంలో సోదాలు నిర్వహిస్తున్నది. మరోవైపు, ఈడీ సోదాలపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.