టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరిని టీడీపీ నేతలు బండారు సత్యనారాయణ మూర్తి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి పరామర్శించారు. ఈ సందర్భంగా బండారు సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ.. ‘‘జగన్మోహన్ రెడ్డి నీకు నీ కేసులకు భయపడతాం అనుకుంటున్నావా క్వశ్చనే లేదు. భయపడం. చివరి క్షణం వరకు పోరాడుతాం.. ప్రజాస్వామ్య వ్యవస్థలో తప్పులను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు ఉంటుంది. ప్రశ్నించే గొంతును నొక్కేసి తప్పుడు కేసులు పెట్టి అరెస్టులు చేస్తారా.. వంద రోజులు లెక్కపెట్టుకో జగన్మోహన్ రెడ్డి తర్వాత నీ పరిస్థితి ఎలా ఉంటుందో రాష్ట్ర ప్రజలే తేలుస్తారు. చంద్రబాబు అరెస్టు గురించి జగన్‌కు తెలియదనడం హాస్యాస్పదం. నిన్ను దొంగ అనాలా….? గజదొంగ అనాలా ….? ఇంకా ఏమైనా అనాలా జగన్.. ప్రజల్ని తప్పుదోవ పట్టించాలని చూస్తున్నావు జగన్.. తెలుగు దేశం పార్టీ చేపట్టిన కార్యక్రమాలు చూసి వైసీపీకి చెమటలు పడుతున్నాయి. నీ నిజాయితీ ఏంటో నీ ఆస్తులు ప్రకటించి నిరూపించుకో.
ఓటర్ల లిస్టులో తప్పు ఒప్పులను సరిచేసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉందన్నారు. చంద్రబాబుపై అక్రమ కేసులు బనాయించి.. జగన్ పైశాచిక ఆనందం పొందుతున్నారని విమర్శించారు. జగన్.. పోలీసులు లేకుండా కార్యకర్తలతో దమ్ముంటే వీధుల్లోకి రా అంటూ సవాల్ విసిరారు.