తెలంగాణ వీణ, క్రీడలు : వరల్డ్‌కప్‌లో న్యూజిలాండ్ రెండో విజయం సాధించింది. ఆరంభ మ్యాచ్‌లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లండ్‌పై గెలిచిన కివీస్..రెండో మ్యాచ్‌లో పసికూన నెదర్లాండ్స్‌పై విరుచుకుపడింది. 99 పరుగుల తేడాతో భారీ విజయాన్ని సాధించింది. ఉప్పల్ స్టేడియంలో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 322 రన్స్ చేసింది. విల్ యంగ్, రచిన్ రవీంద్ర, లాథమ్ హాఫ్ సెంచరీలు చేశారు.ఇక 323 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ధాటిగా ఆడినా వికెట్లు కోల్పోయింది నెదర్లాండ్స్. మిచెల్ సాంట్నర్ ఐదు వికెట్లతో నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్ వెన్ను విరిచాడు. దీంతో 46.3 ఓవర్లలో 223 పరుగులకు ఆలౌట్ అయింది నెదర్లాండ్ జట్టు. నెదర్లాండ్ జట్టులో అకెర్‌మన్ 69 పరుగులు చేసి టాప్‌స్కోరర్‌గా నిలిచాడు. ఎడ్వర్డ్స్ 30 పరుగులు చేశాడు. ఇక ఈ మ్యాచ్‌తో సాంట్నర్ 2023 వరల్డ్‌కప్ లో 5 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా… వరల్డ్‌కప్ చరిత్రలో ఐదు వికెట్లు తీసిన తొలి న్యూజిలాండ్ స్పిన్నర్‌గా చరిత్ర సృష్టించాడు.