తెలంగాణ వీణ , హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకంటే ఆదర్శరాష్ట్రం గా తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలోని బీఆర్‌ఎస్ పార్టీని మూడోసారి గెలిపించుకుందామని, ఉప్పల్‌లో గులాబీ జెండాను ఎగురవేద్దామని ఉప్పల్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం కాప్రా డివిజన్, ఎల్లారెడ్డిగూడ మల్లారెడ్డి గార్డెన్‌లో డివిజన్ బీఆర్‌ఎస్ నాయకుల ఆత్మీయ సమ్మేళన సభకు ఉప్పల్ బీఆర్‌ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. కాప్రా తాసీల్దార్ కార్యాలయం చౌరస్తా నుంచి డప్పు చప్పుళ్లు, బోనాలు, కోలాటాలు, నృత్యాలతో భారీ ర్యాలీ మధ్యన ప్రచారరథంపై బీఎల్‌ఆర్‌ను ఫంక్షన్‌హాల్ వరకు తీసుకెళ్లారు. అనంతరం జరిగిన సమావేశంలో లక్ష్మారెడ్డి మాట్లాడుతూ. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఆవిర్భావం సందర్భంగా ఎదురైన సవాళ్లను, సమస్యలను అధిగమిస్తూ తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో ముందుకు దూసుకువెళ్లేలా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని పేర్కొన్నారు.
వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు రైతుబంధు, రైతు బీమా, రుణమాఫీకి నిధులు కేటాయించడంతో పాటు మహిళా శిశు సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ స్వయం సహాయక సంఘాలను, పొదుపు సంఘాలను బలోపేతం చేసేందుకు చర్యలు తీసుకోవడం, సంక్షేమఫలాలు అన్నివర్గాలకు అందేలా పథకాల రూపకల్పన జరగడంతో అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ సాధించిన ప్రగతి సీఎం కేసీఆర్ పరిపాలన దక్షతకు నిదర్శనమని అన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మూడవసారి గెలిచి బీఆర్‌ఎస్ అధికారంలోకి వస్తుందని, ఉప్పల్‌లో పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు. కాప్రాడివిజన్ సమస్యలు తనకు తెలుసని, వాటిని తప్పకుండా పరిష్కరించేందుకు కృషి చేస్తాను . డివిజన్ కార్పొరేటర్ స్వర్ణరాజు మాట్లాడుతూ.. అందరికీ మేలు చేసే మంచి మనసున్న బీఎల్‌ఆర్‌ను భారీ మెజారిటీతో గెలిపిచేందుకు నాయకులు, కార్యకర్తలు కృషిచేయాలని అన్నారు. ఎంబీసీ మాజీ చైర్మన్ తాడూరి శ్రీనివాస్, మాజీ కార్పొరేటర్లు కొత్తరామారావు, గొల్లూరి అంజయ్య, ఉప్పల్ బీఆర్‌ఎస్ మైనారిటీ విభాగం అధ్యక్షుడు ఎంకే బద్రుద్దీన్, కాప్రాడివిజన్ బీఆర్‌ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్‌రెడ్డి, బండారి నీలంరెడ్డి, ఎన్.మహేశ్, వంశరాజ్‌మల్లేశ్, బైరి నవీన్‌గౌడ్, కొప్పుల కుమార్, సురేఖ, కొండల్ గౌడ్, గిల్బర్ట్, బైరి భాస్కర్‌గౌడ్, రవీందర్‌రావు, గౌస్, అలీ, వెంకటేశ్, మచ్చపాండు, ఇంద్రయ్య, శివకుమార్, పార్టీనాయకులు, కార్యకర్తలు, మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.