తెలంగాణ వీణ , పాలిటిక్స్ : జూబ్లీహిల్స్ డివిజన్‌లోని పలు బస్తీల్లో మురుగు సమస్యలను పరిష్కరించడంతో పాటు మంచినీటి సరఫరాను మరింత మెరుగుపర్చేందుకు జలమండలి ఆధ్వర్యంలో సుమారు రూ. 2కోట్ల వ్యయంతో చేపట్టనున్న అభివృద్ధ్ది పనులను ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ సోమవారం ప్రారంభించారు. సోమవారం ఉదయం 10 నుంచి 11 గంటల నడుమ డివిజన్ పరిధిలోని పలు బస్తీల్లో సుడిగాలి పర్యటన చేశారు. ఎన్నికల కోడ్ రానుండడంతో వివిధ బస్తీల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. బండారుబాల్‌రెడ్డి నగర్‌లో మురుగు సమస్యల పరిష్కారం కోసం రూ.57లక్షల వ్యయంతో చేపట్టనున్న 300 ఎంఎం డయా సీవరేజ్ లైన్, 450 ఎంఎం డయా ఆర్‌సీసీసీ ఎన్‌పీ3 సీవరేజీ లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
వినాయక్‌నగర్ బస్తీలో తరచూ పొంగుతున్న మ్యాన్‌హోళ్ల సమస్యలను పరిష్కరించేందుకు రూ.15.5లక్షల వ్యయంతో వేయనున్న 300 ఎంఎం డయా సీవరేజ్ లైన్ పనులను ఎమ్మెల్యే దానం నాగేందర్ ప్రారంభించారు.
అంబేద్కర్‌నగర్‌లో రూ.14లక్షలతో మంచినీటి పైప్‌లైన్ పనులను,రూ.12.2లక్షల వ్యయంతో సీవరేజ్ లైన్ పనులకు శంకుస్థాపన చేశారు.
స్వామి వివేకానంద నగర్ బస్తీలో రూ. 11.9లక్షల వ్యయంతో 100 ఎంఎమ్ డయా మంచినీటి లైన్‌పనులను, దుర్గాభవానీనగర్‌లో రూ.12లక్షల వ్యయంతో సీవరేజ్ లైన్ పనులను ప్రారంభించారు.
జ్ఞానీజైల్‌సింగ్‌నగర్‌లో రూ.13.3లక్షల వ్యయంతో 250 డయా సీవరేజ్ లైన్ పనులను, భగత్‌సింగ్ కాలనీలో రూ.19లక్షల వ్యయంతో చేపట్టిన 300 ఎంఎం డయా సీవరేజ్‌లైన్ పనులను ఎమ్మెల్యే ప్రారంభించారు.
బసవతారకం నగర్ బస్తీలో రూ.14లక్షల వ్యయంతో 300 డయా సీవరేజ్ లైన్ పనులకు ఎమ్మెల్యే దానం నాగేందర్ శంకుస్థాపన చేశారు.