తెలంగాణ వీణ , పాలిటిక్స్ : ఎన్నికల నగారా మోగింది. సోమవారం మధ్యాహ్నమే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో గ్రేటర్‌లో రాజకీయవేడి రాజుకున్నది. ఓ వైపు షెడ్యూల్ ఖరారైనా.. ప్రతిపక్ష పార్టీల్లో అభ్యర్థులు ఇంకా ఖరారు కాలేదు. అధిష్ఠానాన్ని ప్రసన్నం చేసుకునేందుకు హస్తిన బాటలో నేతలు ఉండడంతో స్థానిక నేతల్లో ఆందోళన నెలకొన్నది. మరో వైపు కారు పార్టీ అభ్యర్థులు క్షేత్ర స్థాయిలో దూసుకుపోతున్నారు. రెండు నెలల ముందుగానే అభ్యర్థులను ప్రకటించడంతో ప్రజలతో మమేకమై ఇప్పటికే తొలి దఫా ప్రచారాన్ని ముగించారు. ప్రధాన పార్టీలన్నీ ప్రజాక్షేత్రంలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్న వేళ.. ఇక గల్లీలు, కాలనీల్లో అభ్యర్థులు ఓటర్లను ఆకట్టుకునేందుకు హోరాహోరీ ప్రచారం చేయనున్నారు. పోల్ పోరులో మాటల తూటాలు, సవాల్-ప్రతిసవాల్‌లతో రాజకీయం ఊపందుకోనుంది. జాతీయ, రాష్ట్ర స్థాయి నేతలతో ప్రచార పర్వంలో ఓట్ల పండగ రసవత్తరంగా జరగనున్నది. రాష్ట్ర స్థాయి నేతలతో బహిరంగ సభలు, రోడ్ షోలు, అంతర్గత సమావేశాలతో పాటు స్టార్ క్యాంపెయిన్‌లను ప్రచార పర్వంలోకి దించి ఓట్ల పండగ రసవత్తరంగా సాగనుంది. ఈ క్రమంలోనే బీఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థులు గడిచిన రెండు నెలలుగా జనంతో మమేకమై నియోజకవర్గాన్ని చుట్టేసి తొలి దఫా ప్రచారాన్ని ముగించారు. మెజార్టీ స్థానాల్లో పార్టీ ఎమ్మెల్యేలు తిరిగి మరోసారి ఎన్నికల్లో పోటీ చేస్తుండటం, పార్టీకి బలమైన ఆదరణతో పాటు తొమ్మిదిన్నరేళ్లలో సాధించిన ప్రగతితో అభ్యర్థుల గెలుపు నల్లేరు మీద నడకలాంటిదేనని రాజకీయ విశ్లేషకులు