తెలంగాణ వీణ, హైదరాబాద్ : ఎన్నికల నోటిఫికేషన్ వెలువడడంతో ఈ నెల 15వ తేదీన ఎమ్మెల్యే అభ్యర్థులతో తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు సమావేశం కానున్నారు. ఈ సందర్భంగా అభ్యర్ధులను ఆయన బి ఫారాలను అభ్యర్థులకు అందజేయనున్నారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో పాటించాల్సిన నియమ నిబంధనలు తదితర అంశాలపై అభ్యర్థులకు అధ్యక్షులు సిఎం కేసీఆర్ వివరిస్తారు. పలు సూచనలు ఇస్తారు. అనంతరం పార్టీ మేనిఫెస్టో విడుదల చేయనున్నారు. తదనంతరం జిల్లాల పర్యటనకు కేసీఆర్ బయలుదేరి వెళ్లనున్నారు. 15న హైదరాబాబాద్ నుంచి బయలుదేరి హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4 గంటలకు సీఎం కేసీఆర్ పాల్గొంటారు.16న జనగామ, భువనగిరి నియోజకవర్గాలు,17న సిద్దిపేట, సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రాల్లో నిర్వహించే బహిరంగ సభలో పాల్గొంటారు. 18నమధ్యాహ్నం 2 గంటలకు జడ్చర్ల నియోజకవర్గ కేంద్రం లో., అదే రోజు సాయంత్రం 4 గంటలకు మేడ్చల్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొంటారు. కాగా నవంబర్ 9వ తేదీన గజ్వేల్, కామారెడ్డి రెండు నియోజకవర్గాల నుంచి ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ వేయనున్నారు. ఇందులో భాగంగా 9వ తేదీ ఉదయం సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లి వెంకటేశ్వర స్వామి దేవాలయానికి వెళ్లి ఆనవాయితీ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. అనంతరం గజ్వేల్ లో సిఎం కేసీఆర్ మొదటి నామినేషన్ వేస్తారు. ఆ తర్వాత మధ్యాహ్నం రెండు గంటలకు కామారెడ్డిలో రెండవ నామినేషన్ వేస్తారు.అనంతరం మూడు గంటల నుంచి ప్రారంభమయ్యే కామారెడ్డి బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొంటారు.