Sunday, December 22, 2024
For Advertisements and Commercials on Online News Portal and E-Paper, Contact 9052522626, 9052522727
spot_img

మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై తీర్పు వాయిదా..

Must read

తెలంగాణ వీణ, హైదరాబాద్‌ : తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు తీర్పును వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు వెల్లడించింది.తెలంగాణ మంత్రి శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక వివాదంపై తీర్పు మంగళవారానికి వాయిదా పడింది. ఈ మేరకు తీర్పును వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర హైకోర్టు వెల్లడించింది. శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నిక చెల్లదంటూ 2019లో మహబూబ్‌నగర్‌కు చెందిన రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. శ్రీనివాస్​గౌడ్​ 2018లో సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లో​ తన​ ఆస్తులు, అప్పుల గురించి తప్పుడు సమాచారం అందించారని​ రాఘవేంద్రరాజు హైకోర్టులో పిటిషన్​ వేశారు. ఎన్నికల అఫిడవిట్‌ను ఒకసారి రిటర్నింగ్‌ అధికారికి సమర్పించి.. మళ్లీ వెనక్కి తీసుకుని సవరించి అందజేశారని పేర్కొన్నారు. ఇది చట్టవిరుద్ధమని.. ఆయన ఎన్నికను రద్దు చేయాలని న్యాయస్థానాన్ని కోరారు.

- Advertisement -spot_img
- Advertisement -spot_img
error: You are not allowed to Copy Our Content , Thank you